Amazon: అమెజాన్ సంచలన ప్రాజెక్టు.. ఇంటర్నెట్ అవసరాల కోసం 3 వేల ఉపగ్రహాలు ప్రయోగించాలని నిర్ణయం
- అతి తక్కువ ఎత్తులో పరిభ్రమించే అమెజాన్ ఉపగ్రహాలు
- హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలే లక్ష్యంగా ప్రాజెక్టు
- ‘ప్రాజెక్ట్ కుయిపెర్’ను ప్రారంభించిన అమెజాన్
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఏకంగా 3 వేల ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘ప్రాజెక్ట్ కుయిపెర్’ను ప్రారంభించింది. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ అవసరాలకు నోచుకోని ప్రపంచంలోని పలు ప్రాంతాలకు వీటి ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉద్దేశించి ఈ దీర్ఘకాలిక ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు తెలిపింది. తక్కువ ఎత్తులో పరిభ్రమించే ఈ ఉపగ్రహాలతో లో-లేటెన్సీ, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించగలవని కంపెనీ పేర్కొంది.