Rahul Gandhi: రాహుల్ నామినేషన్ అనంతరం ప్రియాంకాగాంధీ భావోద్వేగ ట్వీట్

  • రాహుల్ నాకు నిజమైన మిత్రుడు
  • చాలా ధైర్యవంతుడు
  • జాగ్రత్తగా చూసుకోండి

ఈసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేయనున్న విషయం తెలిసిందే. నేడు ఆయన తన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి నేడు వయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దక్షిణాదిలో పట్టు సాధించేందుకు రాహుల్ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం.

ఈ నామినేషన్ తంతు పూర్తయిన అనంతరం ప్రియాంకా గాంధీ భావోద్వేగ సందేశాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ‘‘నా సోదరుడు నాకు నిజమైన మిత్రుడు.. నాకు తెలిసినంత వరకు చాలా ధైర్యవంతుడు. వయనాడ్‌ ప్రజలారా.. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని ఏమాత్రం నిరాశపరచడు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Rahul Gandhi
Priyanka Gandhi
Vayanad
Congress
Amethi
  • Loading...

More Telugu News