Tirupati: నేను సీఎం కాగానే తిరుపతిలోనే అడ్మినిస్ట్రేషవ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తా: పవన్ కల్యాణ్

  • తిరుపతిలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తా
  • ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తా
  • ‘హెరిటేజ్’ కారణంగా మూతపడ్డ డెయిరీలను తెరిపిస్తా

తాను సీఎం కాగానే తిరుపతిలోనే అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. తిరుపతిలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, తిరుపతిలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తామని, ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. హెరిటేజ్ సంస్థ కారణంగా మూతపడ్డ డెయిరీలను తెరిపిస్తానని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని, స్విమ్స్ ను ఎయిమ్స్ లా తీర్చిదిద్దుతామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయమై బీఎస్పీ అధినేత్రి మాయావతి సంపూర్ణ మద్దతు ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

Tirupati
janasena party
Pawan Kalyan
cm
  • Loading...

More Telugu News