sensex: వరుసగా రెండో రోజు పతనమైన మార్కెట్లు

  • రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ
  • 192 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 45 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ పతనమయ్యాయి. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన తర్వాత మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 192 పాయింట్లు నష్టపోయి 38,684కు పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 11,598కి జారుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (2.49%), హీరో మోటో కార్ప్ (2.13%), భారతి ఎయిర్ టెల్ (1.60%), హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (1.44%), ఏసియన్ పెయింట్స్ (1.41%).    

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-3.17%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.34%), యస్ బ్యాంక్ (-2.05%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.51%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-1.08%).

  • Loading...

More Telugu News