allu sirish: అల్లు శిరీశ్ మూవీ విడుదల తేదీ ఖరారు

  • అల్లు శిరీశ్ హీరోగా 'ఏబీసీడీ'
  • త్వరలో ట్రైలర్ రిలీజ్ 
  • మే 17వ  తేదీన సినిమా విడుదల  

సినిమాకి .. సినిమాకి మధ్య అల్లు శిరీశ్ చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఈ సారి కూడా ఆయన మంచి కథ కోసం చాలా రోజులు వెయిట్ చేశాడు. అయితే ఆయనకి సంతృప్తిని కలిగించే కథ దొరక్కపోవడంతో, మలయాళంలో విజయవంతమైన 'ఏబీసీడీ' సినిమా తెలుగు రీమేక్ లో చేశాడు. మలయాళంలో 2013లో వచ్చిన ఈ సినిమా, దుల్కర్ సల్మాన్ కి మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. ఈ కారణంగానే ఆ సినిమా రీమేక్ లో అల్లు శిరీశ్ చేశాడు.

సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, మధుర శ్రీధర్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన వాయిదా వేసుకున్నారు. మే 17ను విడుదల తేదీగా ఖరారు చేశారు. త్వరలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమా అయినా అల్లు శిరీశ్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి. ఈ సినిమాలో శిరీశ్ జోడీగా రుక్షార్ థిల్లోన్ నటించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News