Allagadda: ప్రజల మీదకు డబ్బులు వెదజల్లిన వైసీపీ నేత!

  • అఖిలప్రియపై పోటీకి దిగిన బ్రిజేందర్ రెడ్డి
  • స్థానికుల మీదకు నోట్లు
  • స్వల్ప తొక్కిసలాట

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియపై పోడీపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి బ్రిజేందర్ రెడ్డి చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. నియోజకవర్గ పరిధిలోని సిరివెళ్లలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన, స్థానికుల మీదకు కరెన్సీ నోట్లను వెదజల్లారు. ఆ డబ్బు కోసం ప్రజలు ఎగబడటంతో స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది. బ్రిజేందర్ రెడ్డి ఇలా డబ్బులు వెదజల్లిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించాల్సివుంది.

Allagadda
YSRCP
Cash
Brijender Reddy
  • Loading...

More Telugu News