Kurnool District: నంద్యాల జనసేన అభ్యర్థి ఎస్పీవై రెడ్డికి తీవ్ర అస్వస్థత

  • హుటాహుటిన హైదరాబాద్‌ తరలించిన కుటుంబ సభ్యులు
  • ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • టీడీపీ టికెట్‌ నిరాకరణతో పార్టీ మారిన ఎంపీ

నంద్యాల జనసేన అభ్యర్థి, సిటింగ్‌ ఎంపీ ఎస్పీవై రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన అస్వస్థులు కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌ తరలించారు. అక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

గత ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన ఎస్పీవై రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. అప్పటి నుంచి ఆ పార్టీలో కొనసాగిన ఆయన తాజా ఎన్నికల్లో మళ్లీ నంద్యాల టికెట్టు ఆశించారు. అయితే తెలుగుదేశం పార్టీ మొండిచెయ్యి చూపడంతో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

ఆ పార్టీ టికెట్టు కేటాయించడంతో ప్రస్తుతం నంద్యాల నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓట్లు చీలుతాయన్న ఉద్దేశంతో ఎస్పీవై రెడ్డిని చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ సీటిస్తానని చెప్పినా ఆయన మనసు మార్చుకోలేదు.

Kurnool District
nadyala
spyreddy
ill health
  • Loading...

More Telugu News