Navjot Kaur Sidhu: నవజోత్ సింగ్ సిద్ధూ భార్యకు టికెట్ నిరాకరించిన కాంగ్రెస్.. ఆశించిన రెండు చోట్లా మొండిచేయి!

  • అమృత్‌సర్, చండీగఢ్ నుంచి టికెట్ ఆశించిన నవజోత్ కౌర్
  • రెండు చోట్లా టికెట్ నిరాకరణ
  • రైల్వే మాజీ మంత్రి పవన్‌కుమార్, గురుజిత్‌లకు టికెట్లు

మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్‌కు కాంగ్రెస్ షాకిచ్చింది. ఆమె ఆశించిన రెండు చోట్లా టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ ఎన్నికల్లో ఆమె చండీగఢ్, అమృత్‌సర్  లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒకదాని నుంచి టికెట్ ఆశించారు. తనకు టికెట్ కేటాయించాలని అధిష్ఠానాన్ని అభ్యర్థించారు. ఆమె వినతిని పట్టించుకోని కాంగ్రెస్ చండీగఢ్ నుంచి ఐదుసార్లు గెలుపొందిన రైల్వే మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సాల్‌కు టికెట్ కేటాయించింది. అమృత్‌సర్ నుంచి గురుజిత్‌ సింగ్‌‌ను బరిలోకి దింపింది. ఇలా నవజోత్ కౌర్ అడిగిన రెండు స్థానాల్లోనూ ఆమెకు షాకిస్తూ ఇతరులను బరిలోకి దింపింది. నిజానికి అమృత్‌సర్ నుంచి ఆమెకు టికెట్ కేటాయించాలని భావించినప్పటికీ స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్టు సమాచారం.

Navjot Kaur Sidhu
Congress
Ticket
Chandigarh
Lok Sabha
Navjot Singh Sidhu
  • Loading...

More Telugu News