harsha kumar: వైసీపీలో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్

  • జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
  • ఇటీవలే టీడీపీలో చేరిన హర్షకుమార్
  • అమలాపురం ఎంపీ టికెట్ దక్కకపోవడంతో మనస్తాపం 

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు శ్రీహర్ష కూడా వైసీపీలో చేరారు. వీరిద్దరకీ కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి అమలాపురం సీటును ఆయన ఆశించారు. కానీ, ఆ సీటు దక్కకపోవడంతో హర్షకుమార్ నిరాశకు గురయ్యారు. మనస్తాపంతో టీడీపీకి దూరమయ్యారు.

harsha kumar
Telugudesam
ysrcp
jagan
  • Loading...

More Telugu News