BJP: అఖిలేశ్ యాదవ్‌పై భోజ్‌పురి సూపర్‌స్టార్ దినేశ్ లాల్ యాదవ్‌ను బరిలోకి దింపిన బీజేపీ

  • 20 సినిమాల్లో నటించిన దినేశ్ లాల్
  • ఇటీవలే యోగి సమక్షంలో బీజేపీలో చేరిక
  • సోనియాగాంధీతో తలపడనున్న దినేశ్ ప్రతాప్ సింగ్‌

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌పై బీజేపీ భోజ్‌పురి సూపర్‌స్టార్ దినేశ్ లాల్ యాదవ్‌‌ను బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ అజంగఢ్ నుంచి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆయనను ఎదుర్కొనేందుకు బీజేపీ భోజ్‌పురి నటుడిని రంగంలోకి దింపింది. బుధవారం ఆరు నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మహారాష్ట్రలోని ఈశాన్య ముంబైతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జాబితాలో దినేశ్ లాల్ యాదవ్‌కు చోటు దక్కింది.

ఇక, శివసేనను విమర్శించిన బీజేపీ ఈశాన్య ముంబై సిట్టింగ్ ఎంపీ కిరీట్ సోమయకు షాకిస్తూ మనోజ్ కోటక్‌కు టికెట్ కేటాయించింది. యూపీలోని మెయిన్‌పురి నుంచి బరిలో ఉన్న ములాయం సింగ్‌ యాదవ్‌కు ప్రత్యర్థిగా ప్రేమ్ సింగ్ శాక్యాను పోటీలో నిలిపింది. రాయ్‌బరేలీలో సోనియాపై దినేశ్ ప్రతాప్ సింగ్‌ను బరిలోకి దింపింది.  ఇక, అఖిలేశ్ యాదవ్‌పై పోటీ చేస్తున్న దినేశ్ లాల్ యాదవ్ 2006లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆయన ఇప్పటి వరకు 20 సినిమాల్లో నటించారు. ఇటీవలే యోగి సమక్షంలో బీజేపీలో చేరిన ఆయనకు అంతలోనే టికెట్ ఇచ్చింది.  

BJP
Bhojpuri
superstar
Dinesh Lal Yadav
Akhilesh Yadav
Azamgarh
  • Error fetching data: Network response was not ok

More Telugu News