Ambassador: మార్కెట్లోకి మళ్లీ వచ్చేస్తున్న అంబాసిడర్.. ఈసారి ఎలక్ట్రానిక్ కార్లగా దర్శనం!
- 2014లో అంబాసిడర్ తయారీని ఆపేసిన హిందూస్థాన్ మోటార్స్
- కేవలం రూ.80 కోట్లకే హెచ్ఎంను సొంతం చేసుకున్న ఫ్రెంచ్ కంపెనీ
- 2022లో మార్కెట్లోకి రానున్న తొలి అంబాసిడర్ ఎలక్ట్రిక్ వాహనం
దేశంలోని కార్ల మార్కెట్లో కనిపించకుండా పోయిన అంబాసిడర్ మళ్లీ ప్రత్యక్షం కానుంది. అయితే, ఈసారి ఎలక్ట్రానిక్ కార్ల రూపంలో వినియోగదారుల ముందుకు రాబోతోంది. ఇటీవలే హిందూస్థాన్ మోటార్స్‌ను సొంతం చేసుకున్న ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ పీఎస్ఏ తిరిగి అంబాసిడర్ బ్రాండ్‌ను తిరిగి ప్రవేశపెట్టనుంది. 2022 నాటికి ఈ కార్లు మార్కెట్లోకి రానున్నట్టు కంపెనీ పేర్కొంది. అంబాసిడర్ కారుతో భారతీయులకు ఉన్న అనుబంధం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంబాసిడర్‌లో డీఎస్3 క్రాస్‌బాక్ ఈ టెన్స్ ఇంజిన్‌ను అమర్చి మార్కెట్లోకి తీసుకురానుంది. తొలుత కాంపాక్ట్ ఎస్‌యూవీ కానీ, క్రాసోవర్ వాహనాన్ని కానీ మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది. మార్కెట్లో అంబాసిడర్‌కు డిమాండ్ లేకపోవడంతో మే 2014లో హిందూస్థాన్ మోటార్స్ ఈ వాహనాల తయారీని నిలిపివేసింది. ఆ తర్వాత దీనిని ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్ పీఎస్ఏ కేవలం 80 కోట్ల రూపాయలకే సొంతం చేసుకుంది.