Chinese: కోల్‌కతాలో పెద్ద సంఖ్యలో చైనా మూలాలున్న ఓటర్లు.. వారి భాషలోనే టీఎంసీ ప్రచారం

  • టీఎంసీ వినూత్న ప్రచారం
  • చైనా మూలాలున్న వారిని ఆకట్టుకునే ప్రయత్నం
  • తాంగ్రాలో నివసిస్తున్న 2 వేల మంది చైనా సంతతి ప్రజలు

కోల్‌కతాలో పెద్ద సంఖ్యలో ఉన్న చైనా మూలాలున్న ఓటర్లను ఆకట్టుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ కొత్తరకం ప్రచారం ప్రారంభించింది. వారి ఓట్లను కొల్లగొట్టేందుకు చైనా భాషలో ప్రచారం ప్రారంభించింది. ఎక్కడికక్కడ గోడలపై ‘తృణమూల్ కాంగ్రెస్‌కే ఓటేయండి’ అని రాసి ముఖ్యమంత్రి మమత బెనర్జీ, పార్టీ ఎన్నికల చిత్రాలను వేశారు.

నగరంలోని తాంగ్రాలో చైనా సంతతి ప్రజలు 2 వేల మంది వరకు నివసిస్తుండడంతో టీఎంసీ ఈ ఎత్తుగడ వేసింది. అంతేకాదు, చైనా భాషలో కరపత్రాలు కూడా ముద్రించి పంచనున్నట్టు టీఎంసీ నేత ఒకరు తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న చైనా సంతతి వారికి హిందీతోపాటు స్థానిక భాషలు వచ్చినప్పటికీ వారి మాతృభాషలో ప్రచారం చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావించబట్టే ఈ ప్రచారానికి దిగినట్టు ఆయన పేర్కొన్నారు.

Chinese
wall graffiti
Kolkata
West Bengal
Mamata banerjee
  • Loading...

More Telugu News