Adinarayanareddy: ఐటీ దాడులు బీజేపీ, వైసీపీల కుట్రలు: ఆదినారాయణరెడ్డి ధ్వజం

  • టీడీపీ నేతలే టార్గెట్‌గా ఐటీ దాడులు
  • లోటస్‌పాండ్ వేదికగా కుట్ర
  • పుట్టా ఇంట్లో ఏమీ దొరకలేదు

టీడీపీ నేతలను టార్గెట్ చేసి ఐటీ దాడులకు పాల్పడుతున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నేతలే టార్గెట్‌గా ప్రధాని మోదీ ఆదేశాల మేరకు లోటస్‌పాండ్‌లో కుట్ర జరిగిందని ఆరోపించారు.

టీడీపీ నేతలను ఎన్నికల సమయంలో ఇబ్బందులపాలు చేయాలనే ఆలోచనతోనే బీజేపీ, వైసీపీ నేతలు కలిసి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంట్లో ఐటీ రైడ్స్ చేపట్టిన అధికారులకు ఏమీ దొరకలేదని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.  

Adinarayanareddy
Telugudesam
BJP
YSRCP
Narendra Modi
Jagan
Lotus Pond
Putta
  • Loading...

More Telugu News