Election Commission: పసుపు-కుంకుమ నగదు విడుదలకు కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్

  • డ్వాక్రా మహిళలకు రూ.10 వేల సాయం
  • మూడో విడతను నిలిపివేయాలని ఫిర్యాదు
  • పథకానికి కోడ్ అడ్డురాదన్న ఎన్నికల కమిషన్

పసుపు-కుంకుమ నగదు విడుదలకు కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం రూ.10 వేలు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి విడతగా రూ.2500, రెండో విడతగా రూ.3500 ప్రభుత్వం అందించింది.

అయితే మూడో విడతగా రూ.4 వేలు అందించాల్సి ఉండగా పథకం నిలిపివేత కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విపక్షాలు ఫిర్యాదు చేశాయి. అయితే లబ్దిదారుల ఎంపిక పూర్తయినందున పథకం అమలుకు ఇబ్బంది లేదని, దీనికి ఎన్నికల కోడ్ అడ్డు రాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో వెంటనే ప్రభుత్వం పసుపు-కుంకుమ మూడో విడత కింద రూ.3900 కోట్లు విడుదల చేసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News