Jagan: జగన్ పై దాడి కేసు ఈ నెల 16కి వాయిదా వేసిన ఎన్ఐఏ కోర్టు
- శ్రీనివాసరావును ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
- కొద్దిసేపు సాగిన విచారణ
- రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు
కొన్ని నెలల క్రితం ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై వైజాగ్ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. విమానాశ్రయం రెస్టారెంట్ లో పనిచేసే శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో జగన్ పై దాడిచేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోడికత్తి కేసుగా ఈ ఘటన ఎంతో ప్రాచుర్యం అందుకుంది. ఈ కేసును మొదట పోలీసులు చేపట్టినా, ఆ తర్వాత ఎన్ఐఏకు అప్పగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ ఎన్ఐఏ కోర్టులో హాజరు పరిచారు. కొద్దిసేపు విచారణ అనంతరం కేసును ఈ నెల 16కి వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు.