Nellore: ఓ రౌడీలా మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ ని వెంటనే అరెస్టు చేయాలి: వర్ల రామయ్య డిమాండ్

  • ‘చంపడమా? చావడమా?’ అని అనిల్ మాట్లాడతాడా?
  • వైసీపీ అభ్యర్థుల్లో అరవై శాతానికి పైగా నేరచరితులే
  • ఇలాంటి వ్యక్తులకు సభ్యసమాజంలో చోటు లేదు

‘చంపడమా? చావడమా?’ అంటూ వైసీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత వర్ల రామయ్య ఖండించారు. ఈమేరకు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేదికి ఫిర్యాదు చేశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, శాసనసభలో చట్టాలు చేసే వ్యక్తి ఓ వీధి రౌడీలా మాట్లాడారని, సంఘ విద్రోహ శక్తులు కూడా అలా మాట్లాడవని మండిపడ్డారు.

 అసలు, ఎందుకు చంపాలి? ఎందుకు చావాలి? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నవాళ్లు ఎమ్మెల్యే అవుతారని, ఎన్నుకోని వాళ్లు ఓడిపోతారని, దీని కోసం ‘చంపడమా? చావడమా?’ అంటూ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. వైసీపీ అభ్యర్థులందరూ ఇదే విధంగా మాట్లాడుతున్నారని, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితేనే వైసీపీలో స్థానం ఉన్నట్టుగా కనపడుతోందని విమర్శించారు. వైసీపీ అభ్యర్థుల్లో అరవై శాతానికి పైగా నేరచరితులే ఉన్నారని, ఇలాంటి వ్యక్తులకు సభ్యసమాజంలో చోటు లేదని, ఇటువంటి పార్టీ మన రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని వెంటనే అరెస్టు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Nellore
city
mla
YSRCP
anilkumar yadav
Telugudesam
varla
ramaiah
jagan
dwivedi
elections
  • Loading...

More Telugu News