Nellore District: ఇచ్ఛాపురం-తడ వరకు బుల్లెట్ ట్రైన్ తేవాలనుకుంటున్నా: సీఎం చంద్రబాబు

  • నెల్లూరు జిల్లాను అద్భుతంగా తీర్చిదిద్దుతా
  • హైదరాబాద్ లాంటి నగరాలను ఏపీలో తయారు చేస్తా
  • సాగర్ నుంచి సోమశిలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది

ఇచ్ఛాపురం నుంచి తడ వరకు బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని యోచిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాను అద్భుతంగా తీర్చిదిద్దుతామని మరోసారి హామీ ఇచ్చారు.

 హైదరాబాద్ లాంటి నగరాలను ఏపీలో ఒక్కటి కాదు ఇరవై నగరాలను తయారు చేస్తానని అన్నారు. గోదావరి నీళ్లు నెల్లూరుకు వస్తాయని, సాగర్ నుంచి సోమశిలకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తనదని, సోమశిలకు నీళ్లిస్తే సమస్యలన్నీ తీరిపోతాయని అన్నారు. సోమశిల, కండలేరు జలాశయం పనులు పూర్తయితే నీటికి సమస్యే ఉండదని అన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం ప్రతిపక్ష నేతలకు ఇష్టం లేదని విమర్శించారు. 

Nellore District
atmakur
Telugudesam
Chandrababu
cm
  • Loading...

More Telugu News