Andhra Pradesh: ఎన్నికల సంఘం బీజేపీకి ఏజెంట్ గా మారింది.. టీడీపీ 126 సీట్లు గెలుస్తుందని వైసీపీ నేతలే చెబుతున్నారు!: జూపూడి ప్రభాకర్ రావు

  • చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారు
  • బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తాం
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని టీడీపీ నేత, ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు తెలిపారు. ఈ పథకాలే ఈసారి టీడీపీని గెలిపిస్తాయని ఆశాభావం చేశారు. ఈసారి టీడీపీకి 126 సీట్లు వస్తాయని వైసీపీ నేతలే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జూపూడి మాట్లాడారు.

ఎన్నికల సంఘం ప్రస్తుతం బీజేపీకి ఏజెంట్ గా మారిపోయిందని జూపూడి విమర్శించారు. ఏపీలో ఎన్నికల అనంతరం బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం లోటు బడ్జెట్ తో సతమతమవుతున్న ఏపీని చంద్రబాబు గత ఐదేళ్లలో ఎంతో అభివృద్ది చేశారన్నారు. ఏపీని సంక్షేమరాజ్యంగా మార్చిన టీడీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
126 seats
jupudi prabhakar rao
  • Loading...

More Telugu News