Banks: ఈ నెలలో మరో 10 రోజులు బ్యాంకులు పనిచేయవు!

  • ఈ ఏడాది అత్యధిక సెలవులు ఏప్రిల్ లో
  • మొత్తం సెలవులు 11, మిగిలింది 10
  • ఖాతాదారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

బ్యాంకు ఖాతాదారులు, లావాదేవీలు నిర్వహించుకునేవారు అప్రమత్తంగా ఉండాల్సిన నెల ఇది. ఈ సంవత్సరంలోనే అత్యధికంగా 11 సెలవులు ఈ నెలలో ఉన్నాయి కాబట్టి. మార్చి 31న ఆర్థిక సంవత్సరం చివరి రోజు పని చేయడంతో ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన మరో 27 రోజుల్లో 10 రోజులు బ్యాంకులు ఉండవు. 6న ఉగాది, 7న ఆదివారం, 11న పోలింగ్, 13న రెండో శనివారం, 14న ఆదివారం, 17న మహావీర్‌ జయంతి, 19న గుడ్‌ ఫ్రైడే, 21న ఆదివారం, 27న నాల్గవ శనివారం, 28న ఆదివారం... ఈ పది రోజులూ బ్యాంకులు పని చేయవు కాబట్టి, ఖాతాదారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

Banks
Holidays
Elections
April
  • Loading...

More Telugu News