Alia Bhatt: నేను పాకిస్థాన్ వెళ్లిపోయి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది: నటి అలియా భట్ తల్లి

  • పాకిస్థాన్‌పై సోనీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
  • సోనీపై దేశవ్యతిరేకి ముద్ర
  • పాకిస్థాన్ వెళ్లిపోవాలని డిమాండ్

బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ తల్లి, సీనియర్ నటి అయిన సోనీ రజ్దాన్ (62) ‘నో ఫాదర్స్ ఇన్ కశ్మీర్’ అనే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ సాంస్కృతిక సమన్వయం కొరవడిందని వ్యాఖ్యానించారు.

ఇక తాను చేసే వ్యాఖ్యల కారణంగా ఎప్పుడూ ట్రోల్ అవుతుంటానని కూడా వ్యాఖ్యానించారు. కొందరు తనను ‘దేశ వ్యతిరేకి’నని అంటున్నారని, పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ఆలోచిస్తుంటే తాను పాకిస్థాన్ వెళ్లిపోయి ఉంటేనే బాగుండేదని అనిపిస్తోందని అన్నారు. అక్కడైతే తాను ఆనందంగా ఉండేదానినని, అక్కడి వారి ఆహారపు అలవాట్లు కూడా బాగుంటాయని కితాబిచ్చారు.

Alia Bhatt
Soni Razdan
Pakistan
Bollywood
No Fathers In Kashmir
  • Loading...

More Telugu News