Nellore: అన్ని స్థానాల్లోనూ టీడీపీని గెలిపిస్తే వీళ్లందరినీ గజగజ లాడిస్తా: సీఎం చంద్రబాబు

  • కేంద్రం ఎగ్గొట్టిన డబ్బులను వడ్డీతో సహా వసూలు చేస్తా
  • ప్రజలు నాకు అండగా ఉండాలి
  • మళ్లీ టీడీపీని గెలిపించకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి

ఏపీలో అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో టీడీపీని గెలిపిస్తే, వీళ్లందరినీ గజగజలాడిస్తాని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరులో నిర్వహించిన టీడీపీ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం కేంద్రం మనకు రూ.4500 కోట్లు ఇవ్వాలని, ఎగ్గొట్టిన డబ్బులను వడ్డీతో సహా వసూలు చేస్తానని, చూస్తూ ఊరుకోనని అన్నారు. అందుకుగాను, ప్రజలు తనకు అండగా ఉండాలని, అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో టీడీపీని గెలిపించాలని కోరారు.

టీడీపీ పాలనలో నెల్లూరులో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, పట్టణ ప్రాంతాల్లో ఉచితంగా ఇళ్లు కట్టిస్తున్నామని, నెల్లూరును సుందరమైన నగరంగా తీర్చిదిద్దామని అన్నారు. త్వరలో నెల్లూరు ప్రజలు గోదావరి నది నీటిని తాగబోతున్నారని, భావనసాడు నుంచి దుగరాజపట్నం వరకు రోడ్లు విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మళ్లీ టీడీపీని గెలిపించకపోతే, పింఛన్లు, పసుపు-కుంకుమతో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని, ఈ విషయాలన్నింటినీ ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలని కోరారు.

Nellore
Telugudesam
Chandrababu
cm
Road show
  • Loading...

More Telugu News