Sonia Gandhi: తెలంగాణ ఇచ్చింది నాలుగు కుటుంబాల కోసం కాదు, నాలుగు కోట్ల మంది కోసం: కోమటిరెడ్డి

  • ప్రతి పేదవాడి అకౌంట్‌లో రూ.6 వేలు వేస్తాం
  • కేసీఆర్ ఆశకు హద్దుండాలి
  • ఏకంగా ప్రధాని కావాలనుకుంటున్నారు

సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది నాలుగు కుటుంబాల కోసం కాదని, నాలుగు కోట్ల మంది ప్రజల కోసమని  కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నేడు తిరుమలగిరిలో జరిగిన రోడ్‌షోలో కాంగ్రెస్ నేతలతో కలిసి కోమటిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పేదవాడి అకౌంట్‌లో రాహుల్ ప్రధాని కాగానే నెలకు రూ.6 వేలు వేస్తామని తెలిపారు. కేసీఆర్ ఆశకు హద్దుండాలని, 16 మంది ఎంపీలతో ఏకంగా ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోమటిరెడ్డి కోరారు.  

Sonia Gandhi
Rahul Gandhi
Komati Reddy Venkat Reddy
KCR
Tirumalagiri
  • Loading...

More Telugu News