cuddapah: పులివెందులలో జగన్ గెలవడు, అంత వ్యతిరేకత ఉంది: సీఎం చంద్రబాబు

  • పులివెందులలో టీడీపీ మీటింగ్ కొచ్చిన రెస్పాన్సే నిదర్శనం
  • రౌడీయిజం ఎల్లకాలం నడవదు
  • ఈ ఎన్నికలతో వైసీపీ శాశ్వతంగా మూతపడనుంది

పులివెందులకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన కూడా వైసీపీకి లేదని, ప్రతి ఊరికి నీరిస్తే జగన్ సహించలేకపోతున్నాడని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ, పులివెందులలో జగన్ గెలవలేడని, ఆయనపై అంత వ్యతిరేకత ఉందని, ఇటీవల అక్కడ నిర్వహించిన టీడీపీ మీటింగ్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఆ విషయం అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.

రౌడీయిజం ఎల్లకాలం నడుస్తుందని జగన్ అనుకుంటున్నాడని, ఈ ఎన్నికలతో వైసీపీ శాశ్వతంగా మూతపడనుందని అభిప్రాయపడ్డారు. జగన్ పెద్ద రౌడీ అయితే, చెవిరెడ్డి చిన్న రౌడీ అని, ఇలాంటి ఆకురౌడీలను ఎంతోమందిని చూశామని అన్నారు. చెవిరెడ్డి లాంటి వారిని ఓడించి ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.

cuddapah
pulivendula
Chittoor District
chandra giri
Chandrababu
cm
YSRCP
Jagan
chevi reddy
  • Loading...

More Telugu News