Sangareddy: నేను భయపడే వ్యక్తిని కాదు: హరీశ్ రావుకు జగ్గారెడ్డి ఘాటు కౌంటర్

  • భయపడే వాడినైతే ప్రభుత్వంపై పోరాడే వాడినే కాదు
  • ఆపదలో ఉన్న వారికి నేను ‘ఏటీఎం’నే
  • ఎవరెంతమందికి సాయం చేశారో చర్చకు సిద్ధమేనా?

టీఆర్ఎస్ నేత హరీశ్ రావు తనపై చేసిన వ్యాఖ్యలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా బదులిచ్చారు. సంగారెడ్డిలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పోలీస్ కేసులకు తాను భయపడే వ్యక్తిని కాదని, అలాంటి వాడినే అయితే, నాలుగేళ్లుగా ప్రభుత్వంపై పోరాడే వాడినే కాదని అన్నారు.

ఆపదలో ఉన్న వారికి తాను ‘ఏటీఎం’నే అని, ఆ విషయం తన ప్రజలకు తెలుసంటూ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు తగిన విధంగా జవాబిచ్చారు. నేను ఎంత మందికి ఆర్థిక సాయం చేశానో, నువ్వు (హరీశ్ రావు) ఎంత మందికి సాయం చేశావో చర్చకు సిద్ధమా?’ అని సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ వచ్చేలా చూడాలని కోరారు.

Sangareddy
medak
congress
jaggareddy
TRS
  • Loading...

More Telugu News