ABN: ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి: కన్నా లక్ష్మీనారాయణ!

  • టీడీపీ అధికారంలోకి వస్తుందని కథనం
  • తమ పేరిట తప్పుడు కథనమన్న లోక్ నీతి సీఎస్డీఎస్
  • ట్విట్టర్ వేదికగా కన్నా సెటైర్లు

'అధికారం టీడీపీదే' అంటూ ప్రజలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏప్రిల్ ఫూల్ చేసిందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనంలో టీడీపీ 120 సీట్లకు పైగా గెలిచి అధికారంలోకి వస్తుందన్న కథనాన్ని ఇవ్వగా, అది తమ పేరిట వచ్చిన తప్పుడు కథనమని 'లోక్ నీతి సీఎస్డీఎస్' ప్రకటించింది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కన్నా, "అధికారం టీడీపీదే అంటూ ఏప్రిల్ ఫూల్ చేసిన ఏబీఎన్ తెలుగు టీవీ. టీడీపీ గెలుస్తోంది అంటూ లోక్ నీతి-సీఎస్డీఎస్ సర్వే పేరుతో కథనాన్ని ప్రచురించింది. వెంటనే మేము ఎటువంటి సర్వే ఆంధ్రాలో నిర్వహించలేదంటూ లోక్ నీతి స్పష్టంగా చెప్పేసింది. ఇవి గోబెల్స్ రోజులు కావు అని బాబు, ఆంధ్రజ్యోతి గుర్తించాలి" అని సెటైర్ వేశారు.

ABN
andhrajyothi
Kanna
Telugudesam
  • Error fetching data: Network response was not ok

More Telugu News