karunya: మా ఇంట్లో రెండేళ్ల పాటు కరెంటే లేదు .. పాములు, తేళ్లు వచ్చేవి: సింగర్ కారుణ్య

  • కాలనీకి దూరంగా మా ఇల్లు ఉండేది
  • నీళ్లు .. కరెంటు ఉండేవి కావు
  • భయము .. బాధ ఉండేవి కావు

గాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కారుణ్య, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. " మేము హైదరాబాద్ .. 'మీర్ పేట'లోని త్రివేణి నగర్లో ఉండేవాళ్లం. మా నాన్న ఆఫీసుకి .. మా స్కూల్స్ కి దగ్గరలో ఉండేలా అక్కడ ఇల్లు కట్టుకున్నాము. అప్పటికి అక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు. నీళ్లు .. కరెంటు కూడా ఉండేవికావు. అయినా మా కోసం మా నాన్న అక్కడ తుప్పలను బాగుచేయించి ఇల్లు కట్టించాడు.

రెండేళ్ల పాటు ఆ ఇంట్లో కరెంటు లేకుండా వున్నాము .. ఇక ఏరోజుకారోజు రిక్షాలో ఎంతో దూరం వెళ్లి ఆ రోజుకి అవసరమైన నీళ్లు తెచ్చుకునే వాళ్లం. అయితే అవన్నీ పెద్ద కష్టాలుగా మేం ఎప్పుడూ అనుకోలేదు. చుట్టుపక్కల ఇళ్లేమీ లేకపోవడంతో మా ఇంట్లోకి  పాములు .. తేళ్లు .. జెర్రులు వచ్చేసేవి. అయినా మేము భయపడింది లేదు. సొంత ఇల్లు అనే ప్రేమ మేము అందులోనే ఉండేలా చేసింది" అని చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News