Preeti Zinta: నమ్మలేని విజయాన్నిచ్చిన కరణ్ కోసం ఈ బాంగ్రా స్టెప్పులు: ప్రీతి జింతా!

  • ఓడిపోయే మ్యాచ్ ని గెలిపించిన కరణ్ 
  • ఐపీఎల్ లో హ్యాట్రిక్ తీసిన పిన్న వయస్కుడిగా రికార్డు
  • కలిసి స్టెప్పులేసిన ప్రీతి జింతా

ఓడిపోతామని భావించిన మ్యాచ్ లో చివర్లో హ్యాట్రిక్ సాధించి తన జట్టుకు విజయాన్ని అందించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ సామ్ కరణ్ పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం 20 ఏళ్ల 302 రోజుల వయసులో ఐపీఎల్ లో హ్యాట్రిక్ సాధించిన అతిపిన్న వయస్కుడిగానూ కరణ్ నిలువగా, జట్టు సహ యజమాని, నటి ప్రీతీ జింతా ప్రశంసల వర్షం కురిపించింది. తాను గొప్ప విజయాన్ని అందుకున్నామని, ఒత్తిడిలో కరణ్ హ్యాట్రిక్ సాధించాడని కొనియాడింది. 'అతని ఆటతీరుపై ఎంతో సంతోషంగా ఉంది. లయన్ హర్టెడ్ ప్లేయర్ తో చిన్న సెలబ్రేషన్...' అంటూ మైదానంలో కరణ్ తో కలిసి బాంగ్రా స్టెప్పులేసిన వీడియోను ప్రీతి షేర్ చేసుకుంది.



Preeti Zinta
Sam Karran
Bhangra
IPL
  • Loading...

More Telugu News