Jayalalitha: జయలలిత స్వభావం నాకు పూర్తిగా వ్యతిరేకం: ‘తలైవి’ నటి కంగనా రనౌత్

  • ‘తలైవి’లో జయలలిత పాత్ర పోషించనున్న కంగన
  • జయలలితకు విధేయత ఎక్కువన్న బాలీవుడ్ నటి
  • అక్టోబరులో సెట్స్‌పైకి జయలలిత బయోపిక్

మణికర్ణిక చిత్రం హిట్‌తో మంచి ఊపుమీదున్న బాలీవుడ్ ప్రముఖ నటి కంగన రనౌత్ మరో బయోపిక్‌లో నటిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ‘తలైవి’ సినిమాలో ఆమె జయలలిత పాత్రను పోషించబోతోంది. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన కంగన తాజాగా మాట్లాడుతూ.. జయలలితపై ప్రశంసలు కురిపించింది.

సమస్యల్ని ఎదుర్కొని నిలదొక్కుకున్న తీరు అమోఘమని కొనియాడింది. జయ ఎన్నో వివాదాలు ఎదుర్కొన్నారని, ఇంకెన్నో కష్టాలు అనుభవించారని గుర్తు చేసింది. జయలలిత చాలా విధేయతతో ఉండేవారని, తాను ఎటువంటి మార్గంలో ఉన్నాను, దాని ప్రభావం ఎలా ఉంటుందన్న విషయం గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పింది. ఆమె స్వభావం తనకు పూర్తిగా వ్యతిరేకమంది.  

జయలలిత సినిమా చేయాలంటూ దర్శక, నిర్మాతలు తన వద్దకు వచ్చినప్పుడు తాను కొంత సమయం కావాలని అడిగానని చెప్పిన కంగన.. ఆ సమయంలో జయలలిత గురించి తెలుసుకునేందుకు కొన్ని పుస్తకాలు చదివానని, కొన్ని విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోయానని తెలిపింది. అక్టోబరులో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం కంగన తమిళం, భరతనాట్యం నేర్చుకుంటోంది.

Jayalalitha
Bio pic
Manikarnika
thalaivi
kangana ranaut
Tamil Nadu
  • Loading...

More Telugu News