Jagan: ప్రతి వార్డులో ఒక సచివాలయం ఏర్పాటు చేస్తా... పది మందికి ఉద్యోగాలిస్తా: భీమవరం రోడ్ షోలో జగన్ హామీ

  • ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్
  • పంచాయతీల్లో, వార్డుల్లో సెక్రటేరియట్లు
  • చంద్రబాబుకు ఓటేస్తే గోవిందా గోవింద!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రోడ్ షోలో పాల్గొన్నారు. తన ప్రసంగం యావత్తు సీఎం చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపించారు. తన ప్రతి రోడ్ షో మాదిరిగానే ఆయన ఓవైపు చంద్రబాబును విమర్శిస్తూనే, మరోవైపు తాను సీఎం అయితే ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసేదీ వివరంగా చెప్పారు. పాలనలో పారదర్శకత తీసుకువస్తానని, ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు వెంటనే ఉపాధి కల్పిస్తానని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి వార్డులో స్థానిక సచివాలయాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆ సచివాలయాల్లో స్థానిక యువకులు 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అంతేగాకుండా, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ను ఏర్పాటు చేసి ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యతను ఆ వలంటీర్ కు అప్పగిస్తామని తెలిపారు. చంద్రబాబు గతంలో జాబు రావాలంటే బాబు రావాలి అని చెప్పాడని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని జగన్ అన్నారు. జాబు రావాలంటే బాబు పోవాలి అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వచ్చాడు ఉన్న ఉద్యోగాలన్నీ గోవిందా గోవింద అంటూ అనేక రకాల ఉద్యోగాల గురించి జగన్ ఏకరవు పెట్టారు.

  • Loading...

More Telugu News