West Godavari District: నరసాపురంలో సొంత ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఉంది: ‘జనసేన’ ఎంపీ అభ్యర్థి నాగబాబు

  • ప్రత్యర్థులు లేనిపోని విషయాలు మాట్లాడుతుంటారు
  • లోకల్ కు, నాన్ లోకల్ కు తేడా ఏంటి?
  • ఇక్కడ ఒక ఇల్లు ఉండటమే లోకలా?

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి జనసేన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న నాగబాబు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యర్థులు లేనిపోని విషయాలను మాట్లాడుతుంటారని, ఎటువంటి ప్రాముఖ్యత లేని అంశాలను ప్రస్తావిస్తూ ఉంటారని విమర్శించారు. లోకల్ కు, నాన్ లోకల్ కు తేడా ఏంటి? ఇక్కడ ఒక ఇల్లు ఉండటమే ‘లోకల్’ అయితే, అది ఎంత సేపు పని అని అన్నారు. ఎన్నికల ఫలితాలతో ప్రమేయం లేకుండా ఇక్కడ ఒక ఎకరమో, రెండు ఎకరాలో కొనుగోలు చేసి, అక్కడే ఇల్లు కూడా కట్టుకోవాలన్న ఉద్దేశం ఉందని చెప్పారు. అంతకన్నాముందు, ఇక్కడే ఏదో ఒక ఇంటిని లీజ్ కు తీసుకుని ఉంటానని తెలిపారు.

West Godavari District
Narasapuram
janasena
naga babu
Pawan Kalyan
Chiranjeevi
  • Loading...

More Telugu News