Andhra Pradesh: దొంగలంతా వైసీపీ చుట్టూ ఉన్నారు.. షర్మిళ ఉంగరాన్నే కొట్టేశారు: లంకా దినకర్

  • వైసీపీ నేతలు ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
  • రాక్షసానందం పొందుతున్నారు
  • నీచ రాజకీయాల కోసం ఫ్యాక్షన్ ను పెంచి పోషిస్తున్నారు

దొంగలంతా వైసీపీ చుట్టూ ఉన్నారని, ఆ పార్టీ అధినేత జగన్ సోదరి షర్మిళ ఉంగరాన్నే కొట్టేశారని ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ సెటైర్లు విసిరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్న వైసీపీ నేతలు రాక్షసానందాన్ని పొందుతున్నారని, నీచ రాజకీయాల కోసం ఫ్యాక్షన్ ని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ పైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఈ ఫ్రంట్ లో కేసీఆర్, జగన్ తప్ప మరెవరూ లేరని అన్నారు.

Andhra Pradesh
Telugudesam
Lanka Dinakar
YSRCP
  • Loading...

More Telugu News