Tirumala: భక్తులు శ్రీవారికిచ్చే విరాళాలు పక్కదారి పడుతున్నాయి : రమణ దీక్షితులు

  • స్వామి సేవకు వాటిని వినియోగించడం లేదు
  • ఇతర కార్యాలకు వినియోగించడం భక్తులకు క్షేమం కాదు
  • అందువల్ల తిరుమల హుండీల్లో డబ్బులు వేయొద్దు

భక్తులు ఇచ్చే ప్రతి రూపాయి తిరుమల శ్రీవారి సేవకు నేరుగా వినియోగించాలని, కానీ ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తూ టీటీడీ వాటిని పక్కదోవ పట్టిస్తోందని తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపించారు. పచ్చకర్పూరం, కస్తూరి నుంచి పుష్పాలు, వస్త్రాలు, అలంకరణ, ఉత్సవాలన్నింటి వరకు దాతలే సాయం చేస్తున్నా ఏ ఒక్క రూపాయి కూడా స్వామి సేవకు వెళ్లడం లేదని విమర్శించారు. రోజుకి దాదాపు రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు స్వామికి విరాళాల రూపంలో అందుతుండగా, అవన్నీ ఉద్యోగుల అవసరాలకు, ఇంజనీరింగ్‌ పనులకు, కాంట్రాక్టర్లకు, ధర్మప్రచారానికే పోతున్నాయని చెప్పారు.

హుండీలో వేసిన డబ్బు స్వామి సేవకు కాకుండా ఇతరత్రా కార్యక్రమాలకు వినియోగించడం భక్తులకు క్షేమదాయకం కాదని రమణ దీక్షితులు అభిప్రాయపడ్డారు. అందువల్ల భక్తులు తిరుమల హుండీల్లో డబ్బు వేయకుండా ధూపదీపాల్లేని ఆలయాల అర్చకుల జీతాలకు, నైవేద్యాలకు విరాళంగా అందజేస్తే పుణ్యం వస్తుందని సూచించారు. విరాళాలను ఏ ఆలయానికి ఇచ్చినా నేరుగా స్వామి వారికే చేరుతాయని చెప్పారు.

Tirumala
srivaru
hundi
ramanadikshithulu
  • Loading...

More Telugu News