Jeevitha: వైఎస్ జగన్ ను కలిసిన జీవిత, రాజశేఖర్!

  • లోటస్ పాండ్ కు వచ్చిన సినీ దంపతులు
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరికపై చర్చలు
  • ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న జీవిత, రాజశేఖర్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ లు కలిశారు. ఈ ఉదయం లోటస్ పాండ్ లోని వైకాపా ప్రధాన కార్యాలయానికి వచ్చిన వీరు జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరి మధ్య జరిగిన చర్చల వివరాలు బయటకు వెల్లడి కానప్పటికీ, ఈ జంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆపై ఎన్నికల్లో ప్రచారం, తాజా రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. వైసీపీ తరఫున వీరిద్దరూ ఏపీలో పర్యటించి, ఆ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేయనున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

కాగా, నేడు వైఎస్ జగన్ నాలుగు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది.

Jeevitha
Rajashekar
Jagan
YSRCP
  • Loading...

More Telugu News