Cricket: ఎవరడ్డం వచ్చినా కుమ్మేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్!

  • వరుసగా మూడో విజయం
  • రాజస్థాన్ కు తప్పని ఓటమి
  • మరోసారి రాణించిన ధోనీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం రాత్రి జరిగిన పోరులో చెన్నై జట్టు 8 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ ధోనీ చలవతో 175 పరుగులు చేసింది. ధోనీ 46 బంతుల్లో 75* పరుగులు చేశాడు. ఈ లెజెండ్ స్కోరులో 4 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. అనంతరం, 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెన్ స్టోక్స్ 46 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. సూపర్ కింగ్స్ బౌలర్లు చాహర్, తాహిర్, బ్రావో, ఠాకూర్ తలా రెండు వికెట్లతో రాయల్స్ పనిబట్టారు.

Cricket
ipl
csk
rr
  • Loading...

More Telugu News