Telugudesam: ప్రచారం చేస్తూ స్పృహతప్పి పడిపోయిన టీడీపీ ఎమ్మెల్యే

  • బోడె ప్రసాద్ కు వడదెబ్బ
  • ఆసుపత్రిలో చేర్చిన అనుచరులు
  • ప్రచారంలో అపశృతి

కృష్ణా జిల్లా పెనమలూరులో టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఆయన కంకిపాడులో ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఒక్కసారిగా స్పృహతప్పి కిందపడిపోయారు. ఎమ్మెల్యేకి ఏం జరిగిందో అర్థంకాక అనుచరులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయనను తాడిగడపలోని ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందించారు. ఎమ్మెల్యే వడదెబ్బకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన సమయంలో బోడె ప్రసాద్ శ్వాస సంబంధ ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తోంది.

Telugudesam
bode prasad
  • Loading...

More Telugu News