Ram Gopal Varma: మరో బయోపిక్‌కు రంగం సిద్ధం చేస్తున్నానంటూ ఆర్జీవీ సంచలన ప్రకటన

  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో ప్రకంపనలు
  • ఏపీ మినహా ఇతర ప్రాంతాల్లో విడుదల
  • శశికళ బయోపిక్‌ను తెరకెక్కించనున్న వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కించి పెను ప్రకంపనలు సృష్టించడం తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్ విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్నా, ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాల్లో చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రానికిగానూ వర్మకి మంచి ప్రశంసలే దక్కాయి.

అయితే, కాసేపటి క్రితం, తాను మరో బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నానంటూ వర్మ సంచలన ప్రకటన చేశారు. అది ఎవరిదో కాదు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బయోపిక్. మనసంటూ లేని కఠినాత్ములు, జైళ్లు , మన్నార్‌గుడి గ్యాంగ్స్ కు వ్యతిరేకంగా అల్లుకున్న ఓ బంధం కథ. ’ అంటూ వర్మ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

Ram Gopal Varma
Lakshmi's NTR
Sasi Kala
Jayalalitha
Tamilnadu
  • Loading...

More Telugu News