Arbaj khan: మాజీ భార్య వివాహంపై ఆసక్తికరంగా స్పందించిన ప్రముఖ నటుడు

  • మీరు చాలా తెలివైన ప్రశ్న అడిగారు
  • ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి
  • నాకూ కాస్త సమయం ఇవ్వండి

బాలీవుడ్ ప్రేమ జంట మలైకా ఆరోరా, అర్జున్ కపూర్ ఏప్రిల్ 15న వివాహంతో ఒక్కటవబోతున్నారు. అయితే మలైకాకు అర్బాజ్‌ఖాన్‌తో 20 ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి 16 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. వీరిద్దరూ రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం అర్బాజ్, జార్జియా ఆండ్రియానీతో ప్రేమలో ఉన్నారు. అయితే అర్జున్ కపూర్‌తో మలైకా పెళ్లి గురించి మీడియా అర్బాజ్‌ను అడగ్గా, ఆయన చాలా ఆసక్తికరంగా స్పందించారు.

మీరు చాలా తెలివైన ప్రశ్న అడిగారంటూ సరదాగా స్పందించారు. ‘మీరు చాలా తెలివైన ప్రశ్న అడిగారు. రాత్రంతా ఈ విషయం గురించి ఆలోచించి కష్టపడినట్లున్నారు. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి. ఈ విషయం గురించి నన్ను ప్రశ్నించేందుకు మీరు కొంత సమయం తీసుకున్నారు కదా! సమాధానం చెప్పడానికి నాకూ కాస్త సమయం ఇవ్వండి’ అంటూ అర్బాజ్ సరదాగా స్పందిస్తూనే మాట దాటేశారు.

Arbaj khan
Malaika Arora
Boni Kapoor
Georgia Andrenia
Bollywood
  • Loading...

More Telugu News