Rayadurgam: నా కదలికలపై నిఘా పెట్టాల్సిన అవసరమేంటి?: కాపు రామచంద్రారెడ్డిపై కాల్వ ఫైర్

  • నా ప్రతి కదలిక వీడియో రూపంలో ‘కాపు‘ వద్ద ఉంది
  • ఇలా ఎందుకు చేస్తున్నారు? ఏం అవసరం?
  • ‘కాపు’ నీచానికి దిగజారుతున్నారు

రాయదుర్గంలో ఎన్నికల పోరు రసవత్తరం కానుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు, వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నేతలు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, తన ప్రతి కదలిక వీడియో రూపంలో కాపు రామచంద్రారెడ్డి వద్ద ఉందని, ఇలా ఎందుకు చేస్తున్నారు? ఏం అవసరం? అని ప్రశ్నించారు. కాపు గురించి గానీ, ఆయన ప్రచారం గురించి గానీ తాను ఎటువంటి ఆలోచన చేయనప్పుడు తన కదలికలపై నిఘా ఉంచాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. రాజకీయాల కోసం కాపు రామచంద్రారెడ్డి నీచానికి దిగజారుతున్నారని విమర్శించారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి వారిని ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. 

Rayadurgam
YSRCP
kapu ramachandra reddy
kalva
  • Loading...

More Telugu News