cuddapah: చంద్రబాబు పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు: వైఎస్ భారతి
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-cfb12d3d8d869384415f25debfd6820ea1953e5c.jpg)
- బాబు పాలనపై విశ్వాసం పోయింది
- జగన్ అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం
- జమ్మలమడుగులో వైసీపీ నాయకురాలు భారతి
కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షో లో వైఎస్ జగన్ భార్య భారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, బాబు పాలనపై విశ్వాసం పోయిందని విమర్శించారు. జగన్ అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పిన భారతి, వైసీపీ ప్రచారానికి మంది స్పందన వస్తోందని అన్నారు. ‘ఫ్యాన్’ గుర్తుకు ఓటు వేసి వైసీపీని గెలిపించాలని కోరారు.