Jagan: మైక్ అందుకుని లయబద్ధంగా దరువేసిన జగన్... ఊగిపోయిన అభిమానులు!

  • గిద్దలూరు రోడ్ షోలో ఆసక్తికర ఘటన
  • మైక్ చెకింగ్ లో జగన్ హుషారు
  • అభిమానుల హర్షాతిరేకాలు

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా గిద్దలూరు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోకు హాజరైన భారీ జనసందోహాన్ని చూసి ఆయన ఉప్పొంగిపోయారు. అందుకే ప్రసంగం ఆరంభిస్తూ మొదట మైక్ చెక్ చేస్తూ డప్పు శబ్దం చేసి అందరినీ అలరించారు. ఎంతో లయబద్ధంగా జగన్ వినిపించిన డప్పు శబ్దం పార్టీ కార్యకర్తలను, అభిమానులను ఉత్సాహానికి గురిచేసింది. అప్పటివరకు ప్రసంగించిన లోక్ సభ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి మైక్ కు అంటిన చెమటను తుడిచి జగన్ కు అందివ్వగా, జగన్ ఆ మైక్ లో సంగీతం పుట్టించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అంతకుముందు ఆయన అభిమానులు నిదానించాల్సిందిగా సూచనలు చేయడం కూడా కనిపించింది. పదే పదే బతిమాలిన రీతిలో జగన్, అభిమానుల కోసం సంజ్ఞలు చేయడం అందరినీ ఆకర్షించింది.

  • Loading...

More Telugu News