India: దక్షిణాదిపై కన్నేసిన రాహుల్ గాంధీ.. కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ!

  • అమేథీ, వాయనాడ్ నుంచి పోటీ
  • వివరాలు ప్రకటించిన ఏకే ఆంటోనీ
  • కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న వాయనాడ్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయమై క్లారిటీ వచ్చేసింది. ఉత్తరప్రదేశ్ లోని అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ తెలిపారు. ఈ రెండు స్థానాల నుంచి పోటీకి రాహుల్ నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను ప్రకటించారు.

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో వాయనాడ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2009, 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎం.ఐ.షానవాజ్ ఇక్కడ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే గతేడాది ఆయన చనిపోవడంతో ఈ స్థానం ఖాళీగా ఉండిపోయింది.

India
Congress
Rahul Gandhi
amethy
wayanad
Kerala
contest
antony
  • Loading...

More Telugu News