Kurnool District: నడవలేని స్థితిలో స్ట్రెచర్ పైనుంచే టీడీపీ నేత తిక్కారెడ్డి ప్రచారం.. భార్య కంట కన్నీరు

  • ఖగ్గల్లులో ఇటీవల టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం
  • తిక్కారెడ్డి కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్
  • స్ట్రెచర్ పై నుంచే పై నుంచి విస్తృత ప్రచారం

మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి  చేస్తున్న ప్రచారాన్ని ఆయన భార్య వెంకటేశ్వరమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నడవలేని స్థితిలో ప్రత్యేక వాహనంలో స్ట్రెచర్ పైనుంచే ప్రచారం చేస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

రెండు వారాల క్రితం ఖగ్గల్లులో తిక్కారెడ్డి టీడీపీ జెండాను ఎగురవేశారు. ఈ ప్రాంతం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్వస్థలం కావడంతో గ్రామస్తులతో కలిసి బాలనాగిరెడ్డి భార్య జయమ్మ, కుమారుడు ప్రదీప్ రెడ్డిలు అక్కడికి వచ్చి తిక్కారెడ్డిని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది.

దీంతో గొడవను నియంత్రించేందుకు తిక్కారెడ్డి గన్‌మన్ గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రమాదవశాత్తు ఓ బుల్లెట్ తిక్కారెడ్డి కాల్లోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. గాయం ఇంకా మానకపోవడంతో నామినేషన్‌ను కూడా స్ట్రెచర్ పై నుంచే దాఖలు చేశారు. తాజాగా ఎన్నికల ప్రచారాన్ని కూడా అలాగే నిర్వహిస్తున్నారు.

నియోజకవర్గలోని చెట్నేపల్లి, మాధవరం, రచ్చుమర్రి, మాలపల్లి, గ్రామాల్లో శనివారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ.. రెండుసార్లు గెలిచిన బాలనాగిరెడ్డి అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆరోపించారు. తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తూ బాలనాగిరెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  

Kurnool District
Telugudesam
Tikka reddy
Andhra Pradesh
YSRCP
  • Loading...

More Telugu News