Karnataka: లోక్‌సభకు 14 మంది అభ్యర్థులను ప్రకటించిన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర

  • ఖాకీ చొక్కాలు ధరించిన పార్టీ అభ్యర్థులను పరిచయం చేసిన ఉపేంద్ర
  • ఖద్దరు, తెల్ల చొక్కాలు ధరించబోమని వివరణ
  • పారదర్శకతే  ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ లక్ష్యమన్న ఉపేంద్ర

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తన రాజకీయ పార్టీ ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ తరపున లోక్‌సభ బరిలోకి దిగుతున్న 14 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఖాకీ చొక్కాలు ధరించి వచ్చిన 14 మంది అభ్యర్థులను మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఖాకీ చొక్కాలు ఎందుకు ధరించిందీ వివరించారు.

పోటీలో ఉన్న వారందరూ సామన్యులేనని పేర్కొన్న ఉపేంద్ర.. తాము ఖద్దరు, తెల్ల చొక్కాలు ధరించబోమని పేర్కొన్నారు. కార్మికుల్లా ప్రజా సేవ చేస్తామని, అందుకనే ఖాకీ చొక్కాలు ధరించినట్టు తెలిపారు. ఈ చొక్కాలతోనే ప్రచారం చేస్తామని వివరించారు. తాము కులాల గురించి మాట్లాడబోమని, పారదర్శకతమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తమకంటూ ప్రత్యేక మేనిఫెస్టో లేదని, ప్రజలు రూపొందించి ఇచ్చిన మేనిఫెస్టోనే అమలు చేస్తామని పేర్కొన్న ఉపేంద్ర.. తమ పార్టీ గుర్తు ఆటోకే ఓటెయ్యాలని కోరారు.

Karnataka
Actor Upendra
uttama prajakeeya party
Lok Sabha
Elections
  • Loading...

More Telugu News