Tirumala: కాలుతున్న తిరుమల అడవులు... శ్రీవారి పాదాలవైపు దూసుకొస్తున్న మంటలు!

  • గాడికోన అటవీ ప్రాంతంలో నిప్పు
  • వాటర్ గన్ లతో శ్రమిస్తున్న సిబ్బంది
  • అధికారులను అప్రమత్తం చేశామన్న జేఈఓ

తిరుమల శ్రీవారి ఆలయం వెనుకవైపు ఉండే అడవుల్లో నిప్పంటుకుంది. ఈ మంటలు భారీ ఎత్తున చెలరేగుతూ, గాలి వేగం ఎక్కువగా ఉండటంతో శ్రీవారి పాదాల వైపు దూసుకు వస్తున్నాయి. అంతకంతకూ విస్తరిస్తున్న మంటలను అదుపు చేసేందుకు టీటీడీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటవీశాఖ అధికారుల సహకారంతో దాదాపు 200 మంది మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. ఆ ప్రాంతానికి అగ్నిమాపక శకటాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో, సిబ్బంది అందరూ వాటర్ గన్ లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. వాటర్ గన్ లతోనే మంటలు అదుపులోకి వస్తాయని భావిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

గాడికోన అటవీ ప్రాంతంలో ఎవరో వదిలేసిన నిప్పు కారణంగానే ఈ మంటలు సంభవించి వుంటాయని భావిస్తున్నట్టు తెలిపారు. గాలి వేగం కారణంగా మంటలను ఆర్పడం క్లిష్టతరంగా మారిందని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఇప్పటికే 40 హెక్టార్లలో చెట్లన్నీ కాలిపోయాయని, మంటలు ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని అన్నారు. ఇవి తిరుమలవైపు మళ్లకుండా మొత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. 

  • Loading...

More Telugu News