Chandrababu: టీడీపీని వీడిన టీఎన్‌టీయూసీ-టీఎస్ అధ్యక్షుడు బీఎన్ రెడ్డి
- లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అభ్యర్థులను నిలపని టీడీపీ
- చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన బీఎన్ రెడ్డి
- తెలంగాణలో టీడీపీ దీన స్థితిని చూడలేకే రాజీనామా అంటూ వివరణ
టీఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అభ్యర్థులను నిలబెట్టలేకపోయినంత దీనస్థితికి పార్టీ దిగజారిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన..ఇది చూడలేకే పార్టీకి రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ మేరకు రాజీనామా లేఖను పంపినట్టు తెలిపారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి తెలంగాణలో బరిలోకి దిగిన టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఆ తర్వాత పార్టీలో మిగిలిన ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఈ నేపథ్యంలో తాజా లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపకూడదని టీడీపీ నిర్ణయించింది. దీనిని నిరసిస్తూ బీఎన్ రెడ్డి రాజీనామా చేశారు.