Jagan: నేడు జగన్, విజయమ్మ, షర్మిల ప్రచార షెడ్యూల్

  • మూడు జిల్లాల్లో జగన్ పర్యటన
  • శ్రీకాకుళం జిల్లాలో విజయమ్మ
  • గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో షర్మిల

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నేడు నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను వైసీపీ విడుదల చేసింది. ఉదయం 9.30 గంటలకు గూడూరు, 11.30 గంటలకు గిద్దలూరు, మధ్యాహ్నం 1.30 గంటలకు దర్శి, 3.30 గంటలకు మైలవరంలో జరిగే ప్రచార సభల్లో జగన్‌ పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే సమయంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇచ్ఛాపురం, నరసన్నపేట, ఆముదాలవలస పట్టణాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని వెల్లడించారు. జగన్‌ సోదరి షర్మిల నేడు గుంటూరు జిల్లా పెదకూరపాడు, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ప్రకాశం జిల్లా అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Jagan
Elections
Campaign
Sharmila
YS Vijayamma
  • Loading...

More Telugu News