Chandrababu: చంద్రబాబుకు ఎదురుదెబ్బ.. నిరుద్యోగ భృతి పెంపుపై నో చెప్పిన ఈసీ!

  • ఎన్నికలు ముగిసేవరకు పెంపు వద్దు
  • ఇప్పుడు పెంచడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది
  • స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం ద్వారా సీఎం చంద్రబాబుకు గట్టి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కొరడా ఝుళిపించింది. నిరుద్యోగ భృతిని పెంచుతున్నట్టు చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో చెప్పడాన్ని ఈసీ తప్పుబట్టింది. ఎన్నికలు ముగిసేవరకు ఆ పెంపు నిలిపివేయాలని స్పష్టం చేసింది.

చంద్రబాబు కొన్ని నెలల క్రితమే యువనేస్తం పథకంలో భాగంగా డిగ్రీ విద్యార్హత ఉన్న నిరుద్యోగులకు రూ.1000 భృతి అందించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ, నిరుద్యోగ భృతిని రూ.1000 నుంచి రూ.2000కి పెంచుతున్నట్టు ప్రకటించారు. అయితే ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఎన్నికలు ముగిసేవరకు ఆ పెంపు వర్తించదని, ఇలా ప్రకటించడం నియమావళికి విరుద్ధమని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది.

  • Loading...

More Telugu News