Andhra Pradesh: వైసీపీ ప్రచారానికి వెళ్లవద్దని పోలీసులే ప్రజలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు!: కాపు రామచంద్రారెడ్డి ఆరోపణ

  • మా కుటుంబంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు
  • ఈసీకి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది
  • దీనిపై మేం ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తాం

వైసీపీ నేత, రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి టీడీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ నాయకులు పోలీసుల సాయంతో తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎన్నికల ప్రచారానికి వెళ్లవద్దని ఏకంగా పోలీస్ అధికారులు ప్రజలు, కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు అనంతపురంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కాపు రామచంద్రారెడ్డి వైసీపీ కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. పోలీసుల జోక్యంపై ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు. పోలీసులకు ప్రజల సొమ్ముతో జీతాలు ఇస్తున్నారనీ, టీడీపీ నేతల సొమ్ముతో కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh
YSRCP
rayadurgam
kapu ramachandra reddy
Anantapur District
Police
  • Loading...

More Telugu News