vizg: ఈరోజు గాజువాకలో పవన్ కల్యాణ్ రోడ్ షో

  • విజయవాడ నుంచి విశాఖకు వెళ్లనున్న పవన్
  • కర్ణవానిపాలెంలో పవన్ నివాసానికి ఏర్పాట్లు
  • రోడ్ షో అనంతరం అక్కడికి వెళ్లనున్న పవన్ కల్యాణ్

విశాఖపట్టణంలోని గాజువాకలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం రోడ్ షో నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి నాలుగు గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారని జనసేన తెలిపింది. అగనంపూడి జంక్షన్ నుంచి ఈ రోడ్ షో ప్రారంభమై అక్కడి నుంచి రాజీవ్ నగర్, దువ్వాడ, వడ్లపూడి, తుంగ్లాం, నాతయ్యపాలెం, షీలానగర్, అక్కిరెడ్డిపాలెం, మింది వరకు కొనసాగుతుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. గాజువాక ప్రాంత ప్రజల కోసం ఇకపై భవిష్యత్ లో పవన్ ఇక్కడే ఉంటారని పేర్కొంది. అందుకోసం, గాజువాక వై-జంక్షన్ సమీపంలోని కర్ణవానిపాలెంలో నివసించేందుకు ఏర్పాట్లు చేసిన ఇంటికి రోడ్ షో అనంతరం పవన్ వెళతారని పేర్కొంది.   

vizg
jana sean
Pawan Kalyan
gajuvaka
  • Loading...

More Telugu News