Telugudesam: ఈసారి టీడీపీకి 140 సీట్లు.. యరపతినేని జోస్యం

  • మురికి కూపంలా ఉండే పల్నాడును సుందర నగరంగా తీర్చిదిద్దాం
  • ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పండి
  • టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించండి

ఈ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి మరోమారు అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లాలోని మాదినపాడు, తంగెడ, ముత్యాలంపాడు గ్రామాల్లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీడీపీ 140 సీట్లు గెలుచుకోవడం పక్కా అని జోస్యం చెప్పారు. టీడీపీ పాలనతో పల్నాడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. ఒకప్పుడు ఈ పట్టణం మురికి కూపంగా ఉండేదని, నేడు సుందర నగరంగా మారిందన్నారు. నియోజకవర్గంలో రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలని, టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Telugudesam
Guntur District
Palnadu
yarapathineni srinivasa rao
Andhra Pradesh
  • Loading...

More Telugu News